: వరంగల్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని అర్చకుల ఆత్మహత్యాయత్నం


తమ దేవాలయాన్ని తమకే ఇప్పించాలని ఇద్ద‌రు అర్చకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయత్నం చేసిన ఘ‌ట‌న వ‌రంగల్ జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఇటీవ‌లే జిల్లాలోని భద్రకాళీ ఆలయం సమీపంలో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో ఆ ఆల‌య పూజారులు గణపతి శాస్త్రి, సుబ్రమణ్యం గురుస్వామి దేవాదాయ శాఖ తీరుకి నిర‌స‌న‌గా వరంగల్‌ దేవాదాయ శాఖ‌ ఉప కమిషనర్ ఆఫీసు వ‌ద్ద‌కు చేరుకుని త‌మ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీనిని గమించిన అక్క‌డే ఉన్న కొంత‌మంది భ‌క్తులు పూజారుల‌పై నీళ్లు చ‌ల్లారు. దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న‌ అయ్యప్పస్వామి దేవాలయాన్ని త‌మ‌కే ఇవ్వాల‌ని అర్చ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News