: కోమటిరెడ్డికి షాక్!... కాంగ్రెస్ నేత కంపెనీల్లో ఐటీ సోదాలు!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డికి చెందిన కంపెనీల్లో నేటి ఉదయం ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ రంగాల్లో కోమటిరెడ్డి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. నేటి ఉదయం ఉన్నపళంగా ఊడిపడ్డ ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాదు, నల్లగొండ, కాకినాడల్లోని కోమటిరెడ్డికి చెందిన అన్ని కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాల విషయం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం రేపుతోంది.