: శంషాబాద్ విమానాశ్రయంలో విద్యార్థి నుంచి తూటా స్వాధీనం
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తోన్న సిబ్బంది ఓ విద్యార్థి వద్ద తూటా ఉన్నట్లు గమనించారు. విద్యార్థి వద్ద నుంచి తూటాను స్వాధీనం చేసుకొని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నాగాలాండ్ వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థికి ఆ తూటా ఎలా లభించింది? దాన్ని నాగాలాండ్ ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.