: దయాశంకర్ ఇంటికెళ్లిన పోలీసులు!... అజ్ఞాతంలో బీజేపీ బహిష్కృత నేత!


బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఉన్నపళంగా పదవి కోల్పోయారు. పార్టీకి ఆరేళ్ల పాటు దూరమయ్యారు. ఈ అనుచిత వ్యాఖ్యల ప్రభావం అంతటితో ఆగలేదు. పోలీసులను ఆయన ఇంటివద్దకు రప్పించాయి. అయితే పరిస్థితిని ముందుగానే పసిగట్టిన దయాశంకర్ పోలీసులు తన ఇంటికి రాకముందే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దయాశంకర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నేటి ఉదయం బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దయాశంకర్ ను అరెస్ట్ చేయాల్సిందేనని నినదిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రానికే బీఎస్పీ నేతల ఫిర్యాదుతో దయాశంకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నేటి ఉదయం ఆయనను అరెస్ట్ చేసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే దయాశంకర్ అక్కడ లేదు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన ఆయన అంతకుముందే తన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News