: సోషల్‌మీడియా సైట్ల వాడ‌కంలోనూ అమ్మాయిల‌దే పైచేయి!


సోషల్‌మీడియా సైట్లు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్‌, టంబ్లర్‌ల‌ను పాశ్చాత్యదేశాల్లో అమ్మాయిలే అధికంగా ఉప‌యోగిస్తున్నారు. ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్‌బుక్‌ యూజ‌ర్లుగా ఉన్న మ‌గ‌వారి శాతం 66గా ఉంటే అమ్మాయిల శాతం 76గా ఉంద‌ని తాజాగా వెల్ల‌డించిన గ‌ణాంకాల ద్వారా తెలిసింది. ఇక ట్విట్ట‌ర్‌ని 18 శాతం మహిళలు, 17 శాతం పురుషులు వాడుతున్నారు. పింట్రెస్ట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సైట్లకు మగవారు కాస్త దూరంగానే ఉంటున్నారట. వీటికి అమ్మాయిల ఆదరణే ఎక్కువ‌గా ఉంది. అమెరికాలో వీటికి యూజ‌ర్లుగా ఉన్న మ‌హిళ‌ల సంఖ్య కోటికి చేరింది. అయితే లింక్డ్‌ఇన్‌ సైట్ మాత్రం మేల్ యూజర్ల కన్నా అమ్మాయిలు తక్కువగా వాడుతున్నారట. అయితే భార‌త్‌లో ఈ గ‌ణాంకాలు ఎలా ఉన్నాయో ఫేస్‌బుక్‌, ట్విటర్ ఇంకా పేర్కొన‌లేదు. అయితే ఇండియాలో వీటి వాడ‌కంలో మ‌హిళ‌ల శాతం పురుషులకంటే తక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక్క‌డి అమ్మాయిలు వాటిని వాడుతున్న తీరు అంచనా వేయలేమని, సాంకేతిక అంశంలోనూ ఇక్క‌డి అమ్మాయిలపై వివక్ష ఎక్కువేన‌ని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News