: ఢిల్లీలో ‘హై ఫ్రొఫైల్’ వ్యభిచార ముఠా గుట్టు రట్టు!... నిర్వాహకుడి అరెస్ట్!


దేశ రాజధాని ఢిల్లీలో వ్యభిచార ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో గట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందా నగర పోలీసులను షాక్ కు గురి చేస్తోంది. ఇప్పటికే పలు ముఠాలను పోలీసులు చాకచక్యంగా పట్టేయగా... తాజాగా దక్షిణ ఢిల్లీలో గుట్టుగా సాగుతున్న ‘హై ప్రొఫైల్’ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని సఫ్ధర్ జంగ్ లో హై ప్రొఫైల్ వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు వ్యభిచారం జరుగుతున్న ప్రాంతంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార ముఠా నిర్వాహకుడైన 63 ఏళ్ల పీఎన్ సన్యాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News