: జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ నడక!
మరీ భారీగా కాకున్నా, జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి నీటి విడుదల మొదలైంది. ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతూ ఉండటం, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వకు దగ్గరవడంతో, ఈ ఉదయం అన్ని టర్బైన్లనూ స్టార్ట్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతో కిందకు 32 వేల క్యూసెక్కుల నీరు వెళుతోంది. ప్రాజెక్టుకు 74 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అందులో సగం నీటిని శ్రీశైలానికి పంపుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది.