: రాహుల్ గాంధీకి ‘బుధవారం’ గ్రహణం!... సభలో మూడు కునికిపాట్లు ఆ రోజేనట!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిజంగా ‘బుధవారం’ గ్రహణం పట్టుకుంది. బుధవారం వచ్చిందంటే ఆయనకు నిద్రాగడం లేదు. నిజంగానా అంటే... 2014, 2015, 2016 ఏడాదుల్లో వరుసగా చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేనని నమ్మి తీరాల్సిందే. తమ కుటుంబ సొంత నియోజకవర్గంగా భావిస్తున్న అమేధీ నుంచి రాహుల్ గాంధీ లోక్ సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉంటే తప్పనిసరిగా సభకు హాజరవుతున్న రాహుల్ గాంధీ... పలు సందర్భాల్లో ఆయా అంశాలపై జరిగిన చర్చల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. పలు సందర్భాల్లో అధికార పక్షాన్ని ఆయన ఇబ్బంది కూడా పెట్టారు. అయితే 2014, 2015, 2016 ఏడాదుల్లో (నిన్న) ఆయన సభలోనే ఓ కునుకేశారు. ఈ మూడు సందర్భాల్లో ఆయన కునుకేసిన రోజు బుధవారమేనట. ఈ మేరకు మూడేళ్ల పాటు సభలో రాహుల్ కునికిపాట్లకు సంబంధించి పలు పత్రికలు నేటి తమ సంచికల్లో ఆసక్తికర కథనాలు రాశాయి.