: తెలంగాణ లాయర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం


తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల వ్యవహారంపై నిన్న సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జగదీశ్ సింగ్ కెహార్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న సీనియర్ న్యాయవాది బైద్యనాథన్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? లేవా? అన్న విషయంపై ధర్మాసనం సీరియస్ గా విచారణ సాగిస్తుండగా... మధ్యలో కలగజేసుకున్న బైద్యనాథన్ వేరే అంశాన్ని ప్రస్తావించబోయారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కెహార్... ఒక అంశాన్ని పరిష్కరిస్తుండగా, మరో అంశాన్ని ప్రస్తావిస్తూ కేసు విచారణను గందరగోళానికి గురి చేస్తున్నారని బైద్యనాథన్ పై మండిపడ్డారు. ఈ తరహా పధ్ధతి మంచిది కాదని కూడా జస్టిస్ కెహార్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News