: సుప్రీం సూచనల పట్ల కేసీఆర్ హర్షం


తెలంగాణలో టీఆర్ఎస్ నిర్మించ తలపెట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణంపై సుప్రీంకోర్టు సూచనలను స్వాగతిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సుప్రీం ఆదేశాలతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందని అన్నారు. వీలైనంత త్వరగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు శాశ్వత అడ్డంకులు తొలగినట్టేనని అభిప్రాయపడ్డ ఆయన, డిండి, పాలమూరు ప్రాజెక్టులను రాకెట్ వేగంతో నిర్మిస్తామని అన్నారు. సుప్రీం తీర్పుతో తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏపీ వాదనలన్నీ వీగిపోయినట్టేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News