: ఆడి కారులో వచ్చారు... దర్జాగా బీఎండబ్ల్యూ కారులో వెళ్లిపోయారు!


దర్జాగా ఆడికారులో వచ్చిన దుండగులు బీఎండబ్ల్యూ కారు దొంగిలించిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలోని గేటెడ్ కమ్యూనిటీ సెక్టార్-17ను గమనించిన దొంగలు తెలివిగా ప్లాన్ చేసుకుని చోరీ చేసి, ఆఖరికి సీసీ కెమెరాలకు చిక్కారు. నోయిడా డీఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపిన వివరాల్లోకి వెళ్తే... సెక్టార్-17 అనే గేటెడ్ కమ్యూనిటీలో విధులు నిర్వర్తించేందుకు ఉదయానే పని మనుషులు, కార్ డ్రైవర్లు వస్తుంటారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఇద్దరు వ్యక్తులు దర్జాగా ఆడి ఏ7 కారు (కొట్టేసిన కారు)లో 6:59 నిమిషాలకు ప్రవేశించారు. పని మనుషుల కోసం తెరిచి ఉన్న ఇళ్లలో ప్రవేశించారు. తొలుత నల్ల దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి ఏ-11 ఇంట్లోకి వెళ్లి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు. అనంతరం ఏ-20 ఇంట్లోకి వెళ్లి, ల్యాప్ టాప్ పట్టుకుని బయటకు వచ్చాడు. అక్కడి నుంచి ఏ-22 నివాసం ముందున్న కారును బాగా పరిశీలించి, ఆ ఇంట్లోకి వెళ్లారు. తరువాత టేబుల్ పై ఉన్న తాళాలు తీసుకుని, ఇంటి ముందు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారును తీసుకుని గేట్ లోంచి దర్జాగా వెళ్లిపోయారు. వారలా ప్రవేశించినప్పుడు కానీ, బయటకు వెళ్లినప్పుడు కానీ వారిని సిబ్బంది దొంగలుగా గుర్తించలేదు. అయితే వారు దొంగతనం చేసిన తీరును సీసీ కెమెరాలు నిక్షిప్తం చేసుకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News