: మాయావతికి క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ క్షమాపణలు కోరారు. నోరు జారానని అంగీకరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పారు. మాయావతి అంటే గౌరవమని చెప్పిన ఆయన, ఇకపై మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. దయాశంకర్ సింగ్ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే దిశగా బీఎస్పీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. కాగా, మాయావతిపై ఆరోపణలు చేస్తూ, ఆమెను వేశ్యగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.