: రేవంత్ రెడ్డికి ప్రాణహాని... భద్రత పెంచండి!: రాజ్ నాథ్ కు చంద్రబాబు లేఖ
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆయనకు తక్షణమే భద్రత పెంచాలని లేఖలో కోరారు. టీడీఎల్పీ నేతగా ఉన్న రేవంత్ ను హత్య చేయాలని చూస్తున్నట్టు తమకు అనుమానంగా ఉందని, అదనపు భద్రత ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. రేవంత్ కు భద్రత పెంచాలని హోం శాఖ నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో ఆయన కోరారు.