: కుక్కను దారుణంగా చంపి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన హైదరాబాద్ యువకులు.. అరెస్ట్
ఇటీవల చోటుచేసుకున్న చెన్నై తరహా దారుణ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లోనూ కనిపించింది. ముగ్గురు యువకులు ఓ మూగజీవిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఓ కుక్కను చంపేశారు. కుక్కను చంపుతోన్న సమయంలో ఆ వీడియోను రికార్డు చేసి సదరు యువకులు సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. విషయాన్ని తెలుసుకున్న సైబర్ పోలీసులు ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేశారు. సరదాకు ఈ పనిచేశామని యువకులు చెప్పారు. కుక్కలను కర్రలతో కొట్టి, మంటల్లో వేసిన వీడియో జంతు ప్రేమికులను కలచివేస్తోంది. వారు ఘటన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.