: మల్లన్న సాగర్‌ని అడ్డుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది: హరీశ్‌రావు ఆగ్రహం
రైతులకు నీరందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి అడ్డుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఆటంకంగా మారిందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మెదక్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టును పూర్తి చేస్తే రైతులకు చాలా ప్రయోజనం ఉంటుందని, ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ప్రజలందరూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తికావాలనే కోరుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రాజెక్టుపై అనవసర విమర్శలు చేస్తున్నారని హరీశ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చెట్లు పెంచితే వర్షాలు బాగా కురుస్తాయని, తద్వారా కరవు పరిస్థితులు తగ్గుతాయని ఆయన అన్నారు.