: గుజరాత్ కు రాహుల్...దళితులకు పరామర్శ... రాహుల్ తీరుపై మాయావతి ఆగ్రహం


నేటి ఉదయం పార్లమెంటును 'గోవుల కోసం దళితులపై దాడి' ఘటన కుదిపేసింది. పార్లమెంటు కార్యకలాపాలను బీఎస్పీ నేతలు అడ్డుకున్న తరువాత, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి తన గుజరాత్ పర్యటనను ఖరారు చేసుకున్నారు. రేపు ఉదయం గుజరాత్ వెళ్లి బాధిత దళిత యువకులను రాహుల్ పరామర్శించనున్నారు. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు దిగే వారిపై చర్యలకు కఠిన చట్టాలు చేయాలంటూ పార్లమెంటులో ఆందోళనలు చేయాల్సిన సమయంలో, రాహుల్ గాంధీ గుజరాత్ లో దళితుల పరామర్శకు వెళ్లడం ఏంటని మండిపడ్డారు. దాడులు జరిగిన వెంటనే చేయాల్సిన పరామర్శ.. పార్లమెంటులో ఆందోళన చేస్తున్నప్పుడు నిద్రపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు చేయడమేంటని ఆమె నిలదీశారు.

  • Loading...

More Telugu News