: దొనకొండలో విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల తయారీ సంస్థ... డీల్ కుదిరిందన్న శిద్ధా
ప్రకాశం జిల్లా దొనకొండలో విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలను తయారు చేసే కర్మాగారం నెలకొననుందని, దీంతో ఈ ప్రాంతం రూపులేఖలే మారిపోతాయని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఉక్రెయిన్ కు చెందిన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం డీల్ కుదుర్చుకుందని ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాకు తెలిపారు. ఈ పరిశ్రమతో 10 వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. కంపెనీకి అవసరమైన అన్నిమౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రభుత్వ, అటవీ భూములు పుష్కలంగా ఉన్న దొనకొండ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.