: సుజనా ఇంట తెలుగుదేశం నేతల అత్యవసర భేటీ


న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. మరో రెండు రోజుల్లో పార్లమెంటులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేవీపీ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రానున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించాలన్న విషయమై వీరి మధ్య చర్చ జరిగింది. బిల్లుపై చర్చ జరిగే వేళ, హోదా కావాల్సిన ఆవశ్యకతను చెబుతూనే, కాంగ్రెస్ చేసిన మోసాన్ని గురించి గట్టిగా తెలియజేయాలని వీరు నిర్ణయించారని తెలుస్తోంది. దాదాపు ఓటింగ్ ఉండదని భావిస్తున్న వీరు, ఒకవేళ ఓటింగ్ జరిగితే మాత్రం బిల్లుకు అనుకూలంగా ఉంటేనే మంచిదని, లేకుంటే రాష్ట్రంలో ప్రజలకు దూరమవుతామని అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ భేటీకి పలువురు తెలుగుదేశం ఎంపీలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News