: సైనిక తిరుగుబాటుతో టర్కీలో 50 వేల మందిపై ప్రభుత్వం చర్యలు
సైనిక తిరుగుబాటుతో టర్కీలో కలకలం చెలరేగడంతో ఆ దేశ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. 50 వేల మందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఎర్డగాన్ ప్రభుత్వం ఇప్పటివరకు వారిలో అనేక మందిని అదుపులోకి తీసుకుంది. చాలా మందిని వారు నిర్వహిస్తోన్న ఉద్యోగ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికాలో ఉంటూ ఉగ్రవాద సంస్థను నడిపిస్తోన్న ఫెతుల్లా గులెన్ అనే వ్యక్తే సైనిక తిరుగుబాటుకు కారణమని టర్కీ ప్రధాని బినాలి ఎల్దిరిమ్ ఆరోపణలు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే వాటిని సమర్థంగా ఎదుర్కుంటామని, వారిని అణచివేస్తామని బినాలి ఎల్దిరిమ్ పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన గులెన్‌ను తమకు అప్పగించాలని అమెరికాను ఆ దేశ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ అంశమై తమ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టర్కీ ప్రభుత్వం ఫోన్ చేసి ఈ డిమాండ్ ఆయన ముందు ఉంచిందని వైట్‌హౌజ్ పేర్కొంది.