: మూడేళ్ల క్రితం మరణించిన అధికారిని బదిలీ చేసి విమర్శలు కొనితెచ్చుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
మూడేళ్ల క్రితం మరణించిన ఓ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ కావడంతో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్న ఫడ్నవీస్, సందీప్ మారుతి అనే ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ను కోల్హాపూర్ నుంచి నాసిక్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు స్వయంగా సంతకం పెట్టడంతో, విమర్శలు కొనితెచ్చుకున్నట్లయింది. ఆయన ఎప్పుడో మరణించినట్టు తెలుసుకున్న ఫడ్నవీస్, ఆ పొరపాటుకు కారకునిగా గుర్తించిన ఓ క్లర్క్ ను సస్పెండ్ చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విపక్షాలు ఇప్పుడు పట్టుబడుతున్నాయి. ఓ రోడ్డు ప్రమాదంలో సందీప్ మరణించగా, తనకు కారుణ్య కోటా కింద ఉద్యోగం ఇవ్వాలని ఆయన భార్య ప్రభుత్వ అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతుండటం గమనార్హం.