: విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: కడియం శ్రీహరి
తెలంగాణ 'ఎంసెట్ 2' పేపర్ లీకేజీ కలకలంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. కోచింగ్ సెంటర్లు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చూపని విద్యార్థులు ఎంసెట్ 2లో మంచి ర్యాంకర్లుగా నిలిచిన విషయం విదితమే. ఈ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆయన ఈరోజు విన్నవించారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఆయన చెప్పారు. ఇంటెలిజెన్స్, శాఖాపరమైన విచారణ ముమ్మరం చేశామని ఆయన పేర్కొన్నారు.