: అప్పన్న సేవలో చంద్రబాబు దంపతులు
విశాఖ నగరంలో పాదయాత్రను ముగించి రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కొద్ది సేపటి క్రితం కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం నరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉంటారని సమాచారం. ఆ తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.