: హైద‌రాబాద్‌లో స్కై వాక్‌లు, డ్రైనేజీల అభివృద్ధికి నిధులు కోరాం: కేటీఆర్‌


ఢిల్లీ పర్యటనలో ఉన్న‌ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడితో కొన‌సాగిస్తోన్న భేటీ ముగిసింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీకి హడ్కో ద్వారా రూ.785 కోట్లు ఇప్పించాల‌ని కోరిన‌ట్లు పేర్కొన్నారు. ఎన్ఆర్‌పీలో భాగంగా రూ.930 కోట్లు మంజూరు చేయాల‌ని కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్‌లో స్కై వాక్‌లు, డ్రైనేజీల అభివృద్ధికి కేంద్ర‌మంత్రిని నిధులు కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈరోజు సాయంత్రం కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానితో కూడా కేటీఆర్ భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News