: నన్నూ చంపేసేవారే!... 'తిరుగుబాటు' చేదు ఙ్ఞాపకాలను గుర్తు చేసుకున్న టర్కీ అధ్యక్షుడు!
ఊహించని సైనిక తిరుగుబాటును ప్రజల మద్దతుతో టర్కీ ప్రభుత్వం నిష్ఫలం చేసింది. అయితే తిరుగుబాటు చేదు జ్ఞాపకాలు మాత్రం ఆ దేశ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు జరిగిన తిరుగుబాటుతో అతలాకుతలమైన ఆ దేశం ఇప్పుడిప్పుడే ఓ దారిన పడుతోంది. ఈ క్రమంలో మరో తిరుగుబాబు ఎదురైతే ఎలాగన్న భయమే జనాన్ని స్వచ్ఛందంగా రోడ్డపైకి వచ్చేలా చేసింది. ఇక ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్... తిరుగుబాబు సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నిన్న ఓసారి గుర్తు చేసుకున్నారు. ‘‘తిరుగుబాటు జరిగిన రాత్రి నేను విశ్రాంతి తీసుకుంటున్న మర్మరీస్ పట్టణాన్ని తిరుగుబాటు దారులు ముట్టడించారు. ఇంకో 10, 15 నిమిషాలు నేను అక్కడే ఉన్నట్లైతే... నన్నూ చంపేసేవారు. లేదా బందీగా పట్టుకుని ఉండేవారు’’ అని ఆయన నిన్న మీడియాకు చెప్పారు.