: 45 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ.. ఒక్కోటి 28 అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశం
ఓ కొండచిలువ 45 పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన చెన్నైలోని వండలూరు అన్నా జువాలజికల్ పార్కులో ఇటీవల జరిగింది. ఇవి ఒక్కోటి 28 అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశం ఉందని జూపార్క్ అధికారులు తెలిపారు. ఆ పార్కులో మొత్తం 25 కొండచిలువలు సంరక్షణలో ఉన్నాయని, 25 కొండ చిలువల్లోని ఓ ఆడ కొండచిలువ రెండు నెలల క్రితం 45 గుడ్లు పెడితే, వాటిలోంచి మొదట గతనెల 23న 20 గుడ్ల నుంచి 20 కొండచిలువ పిల్లలు వచ్చాయని వారు పేర్కొన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం మిగిలిన 25 గుడ్ల నుంచి 25 కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయని చెప్పారు. దీంతో ఆ కొండచిలువ జన్మనిచ్చిన పిల్లల సంఖ్య 45కు చేరిందట. వీటి సరాసరి బరువు 89.28 గ్రాములుగా జూపార్క్ అధికారులు పేర్కొన్నారు.