: టీడీపీ నేతల వద్ద కోదండరామ్ పేరును ప్రస్తావించిన చంద్రబాబునాయుడు!


తెలంగాణ జేఏసీ చైర్మన్, ఉద్యమనేత ప్రొఫెసర్ కోదండరామ్ పేరును చంద్రబాబునాయుడు తన పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వానికి నిరసనగా కోదండరామ్ వంటి వారే నిరసనలు తెలుపుతున్నారని బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం గురించి కోదండరామ్ కు చాలా బాగా తెలుసునని చెప్పిన చంద్రబాబు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రధాన నేతల్లో ఒకరైన ఆయనే, కేసీఆర్ పాలనను విమర్శిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం తానిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని చెప్పేందుకు ఇదే ఉదాహరణని చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబునాయుడు, కోదండరామ్ ను ప్రశంసించడం ఇప్పుడు తెదేపా వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

  • Loading...

More Telugu News