: హీరో స్ల్పెండర్ ను కిందకు నెట్టేసిన హోండా యాక్టివా!
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్ అంటే, అది హీరో హోండా (ప్రస్తుతం హీరో మోటో) స్ల్పెండర్, ప్యాషన్ పేర్లు వినిపిస్తాయి. దాదాపు 16 సంవత్సరాలుగా భారత మార్కెట్ అగ్రస్థానాన్ని ఈ రెండు బైకులు పంచుకుంటూ ఉండగా, వీటికిప్పుడు హోండా యాక్టివా బ్రేక్ వేసింది. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 13,38,015 యాక్టివా యూనిట్లు అమ్ముడుకాగా, హీరో స్ల్పెండర్ సిరీస్ లో 12,33,725 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) వెల్లడించింది. యాక్టివా సిరీస్ లో 3జి, 125, ఐ పేరిట మూడు వేరియంట్లు ఉండగా, స్ల్పెండర్ సిరీస్ లో సూపర్, ప్రో, ప్రో క్లాసిక్, ఐ స్మార్ట్ మోడళ్లు లభిస్తున్న సంగతి తెలిసిందే.