: ప్రస్తుతానికి లేదు: సిద్ధూకు పంజాబ్ సీఎం అభ్యర్థిత్వంపై కేజ్రీవాల్
రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ సీఎం క్యాండిడేట్ గా నిలపనుందన్న వార్తలపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సూటిగా సమాధానం మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతానికి అటువంటిదేమీ లేదని మాత్రం చెప్పారు. సిద్ధూ మంచివాడని, మంచివాళ్లంతా ఒకే చోటకు చేరుతారని చెప్పుకొచ్చారు. గతంలో సిద్ధూ తనపై చేసిన విమర్శలు అసలు సమస్యే కాదని, రాజకీయాల్లో అదంతా సహజమేనని అన్నారు. పంజాబ్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై తమ పార్టీ వ్యూహ రచన చేస్తోందని చెప్పుకొచ్చారు.