: బ్రాండిక్స్ బస్సును ఢీకొట్టిన లారీ... 40 మంది కార్మికులకు గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం


విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిండా కార్మికులతో వెళుతున్న బహుళ జాతి సంస్థ బ్రాండిక్స్ కంపెనీకి చెందిన బస్సును ఓ లారీ ఢీకొట్టింది. జిల్లాలోని కశింకోట మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం షిఫ్ట్ కు కార్మికులను తీసుకెళుతున్న బస్సు డ్రైవర్ సమయం మించిపోతుందన్న ఆత్రుతతో వేగంగా డ్రైవ్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కంపెనీ యాజమాన్యం గాయపడ్డ కార్మికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది.

  • Loading...

More Telugu News