: మంత్రి కేటీఆర్ పై కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రా ప్రశంసల వర్షం
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కల్ రాజ్ మిశ్రాను కేటీఆర్ కలిశారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని కేటీఆర్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కల్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ, కేటీఆర్ డైనమిక్ లీడర్ అని, కొత్త ఆలోచనలకు ఆయన శ్రీకారం చుడుతున్నారని ప్రశంసించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కు ఎంతో అవగాహన ఉందని, ప్రస్తుతం ఉన్న చట్టాలను ఉపయోగించి ఆ పరిశ్రమలను ఎలా ఆదుకోవచ్చో కేటీఆర్ ప్రస్తావించారని కల్ రాజ్ పేర్కొన్నారు.