: ఏపీలోని ఏడు జిల్లాల్లో ఆయుధాలతో తిరగడంపై నిషేధం
ఏపీలోని ఏడు జిల్లాల్లో పదునైన ఆయుధాలు ధరించి తిరగడంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యాక్షన్, ముఠా దాడుల్లో విధ్వంసాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు హోంశాఖ కార్యదర్శి ఏ.ఆర్.అనురాధ తెలిపారు. అందులో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రలోని మూడు జిల్లాల్లో పదునైన ఆయుధాలను ధరించి తిరగడంపై ఉన్న నిషేధాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఆరు నెలలపాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయుధాలు ధరించి తిరగడం నేరమని ప్రభుత్వం ప్రకటించింది. ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.