: బాలకృష్ణపై మండిపడ్డ హిందూపురం మహిళ


అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణపై ఆయన నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ మండిపడింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని తనలాంటి పేద ప్రజలెందరో ఈ నియోజకవర్గంలో ఉన్నారని, వారి సాదకబాధకాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవట్లేదని ఆ మహిళ మండపడింది. కేవలం సినిమాల్లో డైలాగ్ లు చెప్పేందుకే బాలకృష్ణ పనికొస్తాడని, పేదల గురించి పట్టించుకోని ఆయన పరమ వేస్ట్ అంటూ ఆమె ధ్వజమెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News