: చెన్నై విమానాశ్రయంలో బయల్దేరిన కొన్ని నిమిషాల్లోనే తిరిగి దిగిన విమానం
ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఓ విమానం కొన్ని నిమిషాల్లోనే మళ్లీ అదే ఎయిర్‌పోర్టుకి వచ్చిన సంఘటన చెన్నై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు 258 మంది ప్రయాణికులతో జెడ్డా బయల్దేరిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 12.10 గంటలకు అధికారుల అనుమతితో పైలట్ ఆ విమానాన్ని అదే ఎయిర్‌పోర్టులోకి చేర్చాడు. అయితే, విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమానానికి మరమ్మతు జరిపి, తిరిగి జెడ్డా బయలుదేరడానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.