: తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత.. 319 కిలోల గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఈరోజు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని రాజానగరంలో అక్రమంగా 319 కేజీల గంజాయిని తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకి పట్టుబడ్డారు. దీని విలువను రూ.15 లక్షలుగా పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తోన్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ.37వేల నగదు, 3 సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులు గంజాయిని విశాఖ మన్యం నుంచి తమిళనాడు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తీసుకెళుతున్నారని పోలీసులు తెలిపారు.