: సిద్ధూ పాత వీడియోలు బయటకు... ఇరకాటంలో సిక్కు నేత!


బీజేపీలో ఉన్న సమయంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను బీజేపీ కార్యకర్తలు బయటకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూ, నేడో రేపో ఆప్ లో చేరతారని భావిస్తున్న వేళ, ఆయన విమర్శలు పంజాబ్ టీవీ చానళ్లలో మారుమోగుతున్నాయి. గతంలో పలు సందర్భాల్లో కేజ్రీవాల్ పై ఆయన చేసిన తీవ్ర విమర్శల వీడియోలు విస్తృతంగా ప్రసారం అవుతుండటంతో సిద్ధూ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆందోళనల పేరిట కేజ్రీవాల్ డ్రామాలు చేస్తున్నాడని, రాజకీయాల్లోకి రానంటూ పార్టీ పెట్టారని, వ్యక్తిగత భద్రత, ప్రభుత్వ బంగళా వద్దని తొలుత చెప్పి, ఆపై సకల సౌకర్యాలనూ అనుభవిస్తున్నారని సిద్ధూ చేసి విమర్శల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సైతం చక్కర్లు కొడుతున్నాయి.

  • Loading...

More Telugu News