: వరద నీటిలో మళ్లీ మునిగిన శ్రీరామలింగేశ్వరాలయం


నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని పాత కుస్తాపూర్ శివారులో... గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న శ్రీరామలింగేశ్వరాలయం మళ్లీ ముంపునకు గురైంది. ఆలయం సగ భాగం వరకు వరదనీటిలోనే ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఆలయం బయల్పడటంతో 2015 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని నాందేడ్, ఇతర ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడం, బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో ఎస్సార్సెపీలోకి సుమారు 14 నుంచి 17 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నీట మునిగింది.

  • Loading...

More Telugu News