: రెండేళ్లుగా పోరాడుతున్నా కేంద్రం స్పందించడం లేదు: చలసాని శ్రీనివాస్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని అంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పోరాడుతున్నా కేంద్రం నుంచి ఏ మాత్రం స్పందన లేదని అన్నారు. రెండేళ్ల నుంచి దీక్షలు, ఆందోళనలు చేస్తున్నా కేంద్రం వైఖరిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వడం లేదని అన్నారు.