: ‘మల్లన్నసాగర్ జలాశయం అవసరమా?’ అంశంపై సమావేశంలో పాల్గొన్న కోదండరాం
ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు వస్తోన్న మల్లన్నసాగర్ అంశంలో ముంపు బాధితులకు సంఘీభావంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. మల్లన్న సాగర్ జలాశయం అవసరమా? అనే అంశంపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం, ప్రొ.హరగోపాల్‌తో పాటు పలువురు మేధావులు నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావుతో చర్చిస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం వారు మీడియాతో పలు అంశాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.