: బాక్సింగ్ ఛాంపియన్ విజేందర్ సింగ్‌పై కేసు
జాతీయ జెండాను అవమానపరిచాడనే ఆరోపణతో బాక్సింగ్ ఛాంపియన్ విజేందర్ సింగ్‌పై కేసు నమోదయింది. జెండాలోని రంగులతో ఉన్న షార్ట్స్ ని విజేందర్ సింగ్ ధరించాడని దిల్లీకి చెందిన ఉల్లాస్ అనే వ్యక్తి అక్కడి అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. మూడు రోజుల క్రితం జరిగిన రోజుల డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ బాక్సింగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనే విజేందర్ ఈ చర్యకు పాల్పడ్డాడని ఉల్లాస్ పేర్కొన్నాడు. దీనిపై విజేందర్ స్పందించాల్సి ఉంది.