: కింకర్తవ్యం... దిగ్విజయ్ తో భేటీ అయిన కేవీపీ, రఘువీరా


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన చట్టానికి సవరణలపై రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు చర్చకు రానున్న తరుణంలో, మిగతా పార్టీల మద్దతు ఎలా కూడగట్టాలన్న విషయమై ఆ పార్టీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో బిల్లు పెట్టిన కేవీపీ, ఏపీ పీసీసీ నేత రఘువీరారెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ కు పట్టుబట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ, ఇతర ఎంపీల మద్దతు కూడగట్టుకునే దిశగా సమాలోచనలు జరుపుతోంది. ఈ బిల్లుకు ఓటింగ్ జరిగితే, తెలుగుదేశాన్ని, రాష్ట్రంలోని బీజేపీ నేతలను ఇరికించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. బిల్లుకు మద్దతివ్వకుంటే, రాష్ట్ర ప్రజలకు టీడీపీ, బీజేపీలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, మద్దతిస్తే సంకీర్ణ కూటమిని దెబ్బతీసి, లోక్ సభలో బిల్లు చర్చకు వచ్చేలా చేసిన వాళ్లమవుతామని అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News