: ‘హోదా’పై లోక్ సభలో చర్చకు టీడీపీ నోటీసు!
ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ఏపీ వాణి మరింత ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తాజాగా లోక్ సభలోనూ ఏపీకి హోదాపై చర్చకు అనుమతించాలని ఏపీలో అధికార పార్టీ టీడీపీ నిన్న నోటీసు ఇచ్చింది. టీడీపీ ఎంపీలు మాగంటి మురళీమోహన్, నిమ్మల కిష్టప్పలు ఈ నోటీసులు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వారు ఈ నోటీసు అందజేశారు.