: ఆల్మట్టి నుంచి నారాయణపూర్ జలాశయానికి పెరిగిన వరద నీటి ఉద్ధృతి


ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి నారాయణపూర్ జలాశయానికి వరద నీరు పెరిగింది. నారాయణపూర్ జలాశయంలోకి 1,18,259 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 28,960 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఈరోజు అర్ధరాత్రికి జలాశయం పూర్తిగా నిండే అవకాశముందని, రేపు తెల్లవారుజాము లోపు దిగువన ఉన్న జూరాల జలాశయానికి నీరును విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. నారాయణ పూర్ నుంచి జూరాలకు 70 గంటల్లోగా నీరు వచ్చి చేరుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News