: మైనర్లకు మద్యం అమ్మితే లైసెన్స్ లు రద్దు చేస్తాం: హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు
మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, లైసెన్స్ లు రద్దు చేస్తామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీసీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సైఫాబాద్, గోల్కొండ, గోషామహల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్లు, పబ్ లు, వైన్స్ షాపుల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిబంధనలు పాటించని మద్యం షాపుల నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.