: సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీడీపీ నేత సీతక్క


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ నేత సీతక్క మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పటికీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మోసపు హామీలిచ్చారని ఆమె ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయించినట్లు ప్రచారం చేసుకోవడమే తప్ప, నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదని, గిరిజనుల కోసం టీడీపీ నేత రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో పోరాడతామని సీతక్క పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News