: భారీ స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి నేటి హుండీ ఆదాయం భారీ స్థాయిలో వుంది. రూ.4 కోట్ల 69 లక్షలు హుండీ ఆదాయంగా లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత రికార్డు రూ.5 కోట్ల 44 లక్షలుగా ఉంది. ఆ రికార్డుతో పోలిస్తే శ్రీవారి నేటి హుండీ ఆదాయం రెండో స్థానంలో నిలిచింది. భక్తుల రద్దీ విషయానికొస్తే పెరిగిందనే చెప్పవచ్చు. సర్వదర్శన భక్తులు 18 కంపార్ట్ మెంట్లలో నిండి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. కాలిబాట లో వచ్చిన భక్తులు 8 కంపార్టు మెంట్లలో ఉన్నారని, శ్రీవారిని దర్శించుకునేందుకు వారికి 3 గంటల సమయం పడుతుందని అన్నారు.