: దిల్ షుక్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు
హైదరాబాదులో అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ సాయిబాబా దేవాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ దేవాలయంలో బాంబు పెట్టానంటూ ఆగంతుకుడు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాయిబాబా దేవాలయానికి చేరుకున్న పోలీసులు అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. కాగా, గతంలో సాయిబాబా దేవాలయం లక్ష్యంగా బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మృత్యువాతపడగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మారారు. ఇటీవల ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హైదరాబాదులో పట్టుబడుతుండడంతో, పోలీసులు అలెర్ట్ గా వుంటున్నారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.