: నా దృష్టిలో ప్రేమకు అర్థం ఇదే!: నిత్యా మీనన్


నా దృష్టిలో ప్రేమ అంటే మనల్ని మనం మరిచిపోగలగడం అని నిత్యా మీనన్ చెప్పింది. ప్రేమ అంటే మనకంటే అవతలి వ్యక్తిని ఎక్కువగా చూడడం, అవతలి వ్యక్తిని మనకంటే ఎక్కువగా నమ్మడం, మన సర్వాన్ని అవతలి వ్యక్తిగా భావించడం అని నిత్యామీనన్ చెప్పింది. తన జీవితంలో అలాంటి వ్యక్తి తన తండ్రి అని చెప్పింది. వారికి 'తానే అన్నీ' అని చెప్పిన నిత్యా, తనకు కూడా 'వారే అన్నీ' అని తెలిపింది. కుటుంబాన్ని మించినది ఏదీ లేదని ఆమె స్పష్టం చేసింది. '100 డేస్ ఆఫ్ లవ్' సినిమాలో కూడా అదే చూపిస్తున్నామని పేర్కొంది. ప్రేమకు అందరూ ఒకే డెఫినిషన్ చెప్పరని చెప్పిన నిత్య... ఒక్కొక్కరు ఒక్కోలా భావిస్తారని, అందరూ ప్రేమను తమకంటే ఎక్కువగా భావిస్తారని తెలిపింది.

  • Loading...

More Telugu News