: ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు చంద్రులదీ ఏకాభిప్రాయమేనట!
ప్రాజెక్టుల నిర్మాణం, నదీ జలాల పంపకం వంటి విషయాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలిసిన విషయమే. అయితే, ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు చంద్రులు ఏకాభిప్రాయంపై ఉన్నారట. రెండు రాష్ట్రాలలోను అసెంబ్లీ సీట్లు పెంచే విషయంలో వాళ్లిద్దరూ ఓకే చెప్పారట. రాష్ట్రపతి భవన్ లో ఇటీవల జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు హాజరయ్యారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ కొంచెం సేపు ముచ్చటించుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అసెంబ్లీ సీట్ల పెంపుదల అనేది ఆటంకంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వారితో ప్రస్తావించారట. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే విషయంలో తాము ఏకాభిప్రాయంతో ఉన్నామని, ఈమేరకు కేంద్రానికి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని వీరు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.