: మిషన్ కాకతీయ పనులను పరిశీలించేందుకు వస్తా: ఉమాభారతి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతోన్న పలు ప్రాజెక్టులపై ఆయన ఉమాభారతికి వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన కృష్ణా వాటర్ బోర్డు వివాదంపై స్పందించిన ఉమాభారతి ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ పట్ల ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ పథకం పనులు జరుగుతోన్న తీరును పరిశీలించేందుకు ఓసారి వస్తానని ఆమె తెలిపారు. కేసీఆర్‌తో పాటు ఉమాభారతిని కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ కవిత, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.