: ఇక్కడున్న ముస్లింల గురించి మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదు: కశ్మీర్ అల్లర్లపై రాజ్‌నాథ్ ప్రకటన
కశ్మీర్లో చెలరేగిన అల్లర్లపై రాజ్యసభలో ఈరోజు వాడీవేడీ చర్చ కొనసాగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు కశ్మీర్ అంశంపై విమర్శలు గుప్పిస్తోన్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశంపై ప్రకటన చేశారు. కశ్మీర్లో చెలరేగిన అల్లర్ల వెనుక పాకిస్థాన్ ఉందని ఆయన అన్నారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తూ ఇక్కడున్న ముస్లింల గురించి మాట్లాడే అర్హత పాక్‌కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోని ముస్లింల రక్షణకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పేట్రేగుతోన్న ఉగ్రవాదులను అణచివేయడంలో తాము వెనక్కితగ్గబోమని ఆయన అన్నారు. కశ్మీర్ అంశంపై తాము రాజకీయం చేయడం లేదని, విభజించు-పాలించు విధానం ఎన్డీఏ ప్రభుత్వానిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాటం జరపాలని ఆయన పిలుపునిచ్చారు.